: నాందేడ్ ఎక్స్ ప్రెస్ ప్రమాద ఘటనపై నెల రోజుల్లో నివేదిక
నాందేడ్ ఎక్స్ ప్రెస్ లో జరిగిన ప్రమాద ఘటనపై ఫోరెన్సిక్ విచారణ ప్రారంభమైంది. విచారణలో భాగంగా ఇప్పటివరకూ 39 మందిని విచారించామని, నెల రోజుల్లో ఫోరెన్సిక్ నివేదికను ఇస్తామని రైల్వే సేఫ్టీ కమిషనర్ సంతోష్ మిట్టల్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలోని కొత్త చెరువు వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో 26 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర నివేదికను త్వరలో కేంద్రానికి అందజేస్తామని మిట్టల్ వెల్లడించారు.