: బ్యాటింగ్, బౌలింగ్ లో ఏడో ర్యాంకు టీమిండియా ఆటగాళ్లదే
ప్రపంచ టెస్టు ఆటగాళ్లకు ఐసీసీ ర్యాంకులు కేటాయించింది. ఇందులో బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ ఏడో ర్యాంకును టీమిండియా ఆటగాళ్లే దక్కించుకుని టాప్ టెన్ లో చోటు సంపాదించారు. బ్యాటింగ్ విభాగంలో కొత్త డిపెండబుల్ ఛటేశ్వర్ పూజారా ఏడో ర్యాంకు దక్కించుకోగా, బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ ఏడో ర్యాంకులో నిలిచాడు.
మరో వైపు మురళీ విజయ్, అజింక్య రహానేలు కెరీర్ లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. మురళీ విజయ్ ఆరు స్థానాలు మెరుగుపరుచుకుని 38 వ ర్యాంకుకు చేరుకోగా, రహానే రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 65 నుంచి 63కు చేరుకున్నాడు. తాజాగా రిటైర్మెంట్ ప్రకటించిన కలిస్ 12 వ ర్యాంకులో ఉండగా క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.