: ముంబైలో ఇక ఈ రాత్రంతా జాతరే!


ఈ ఏడాది కొత్త సంవత్సరం వేడుకలు ముంబైలో జాతరలా జరుగనున్నాయి. ఈ వేడుకలు రాత్రంతా నిర్వహించుకునేందుకు బాంబే హైకోర్టు అనుమతిచ్చింది. దీంతో ఈ రోజు రాత్రి హోటళ్లు, రెస్టారెంట్లు తెల్లవారుజాము 5 గంటల వరకు తెరచివుంచుకోవచ్చు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ప్రజలు రాత్రిపూటే బంధుమిత్రులతో కలసి గడపాలనుకుంటారని, అందుకే రాత్రి హోటళ్లు మూసేయాలని ఆదేశించడం సరికాదని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News