: కాంగ్రెస్ పాలనలో ప్రజల మధ్య విద్వేషాలు... అభివృద్ధి లేనేలేదు: కోడెల
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని ప్రజల మధ్య విద్వేషాలు రగిలాయని టీడీపీ నేత కోడెల శివప్రసాద్ విమర్శించారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉండగా రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆరోపించారు. మిగులు జలాలు వినియోగించుకోవాల్సిన ప్రభుత్వం వాటిని రైతులకు అందకుండా చేసిందని మండిపడ్డారు. ఉచిత విద్యలేదు, ఉన్న విద్యకు ఫీజు రీఎంబర్స్ మెంటు అందడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు సరైన వైద్యం అందక ఇంటికో రోగిలా తయారయ్యారని కోడెల అన్నారు. ఉన్న ఆరోగ్యశ్రీ కూడా ఆసుపత్రుల బాగుకే తప్ప ప్రజల రక్షణకు ఉపయోగపడడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.