: శ్రమ దోపిడీ.. రూ. 500కోట్లు


ఒడిశాలో లేబర్ మాఫియా భారీ స్థాయిలో నడుస్తోంది. ల్యాండ్ మాఫియా, డ్రగ్ మాఫియా, మద్యం మాఫియా విన్నాం.. అలానే అక్కడ శ్రామికుల కాయకష్టాన్ని పిండుకుతినే మాఫియా తయారైంది. ఈ మార్కెట్ విలువ 500కోట్ల రూపాయలు. మాఫియా నేతలు కఠిన పేదల దగ్గరకు వెళతారు. అత్యవసర వైద్య ఖర్చుల కోసం 10వేలు, 15 వేల రూపాయలు అప్పు ఇస్తారు. రోజూ రెక్కాడితే గానీ కడుపులోకి మెతుకులు పోని కఠిన పేదలు వారు. తీసుకున్న అప్పు తిరిగివ్వలేని పరిస్థితి. దీంతో వారిని తీసుకెళ్లి పక్కనున్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో పనిలో పెడతారు. వారి కష్టంతో మాఫియాగాళ్లు కాసులు కురిపించుకుంటారు. వెళ్లకపోతే బెదిరిస్తారు.. నాలుగు పీకుతారు కూడా. ఏటా 3లక్షల మంది శ్రమను ఇలా దోచుకుంటున్నారని అంచనా.

  • Loading...

More Telugu News