: కొత్త సంవత్సరానికి తిరుమల రెడీ


నూతన సంవత్సర వేడుకలకు తిరుమల పుణ్యక్షేత్రం ముస్తాబవుతోంది. నూతన ఏడాది ప్రారంభం కావడంతో భక్తులు పోటెత్తుతారని భావించిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి మూడు రోజులపాటు ఆర్జిత సేవలు నిలిపివేసింది. ప్రత్యేక దర్శనం టికెట్లు జనవరి 1న నిలిపివేయనుంది. అలిపిరి, శ్రీవారి మెట్లు మార్గంలో నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి 25 వేల దివ్యదర్శనం టోకెన్లు మాత్రమే జారీ చేయనుంది. వీరిని మంగళవారం అర్థరాత్రి 12 గంటల నుంచి ఆలయానికి వెళ్లే క్యూలైన్లలో అనుమతిస్తారు. ధర్మదర్శనం భక్తులను మంగళవారం సాయంత్రం ఐదుగంటల నుంచి క్యూలైన్లలోకి అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది.

  • Loading...

More Telugu News