: మన తిండిపై సామాజిక ప్రభావం ఉంటుందట!


మనం తినే తిండిపై సామాజిక ప్రభావం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. సామాజిక ప్రభావం వల్ల మనం మితిమీరిన ఆహారం తీసుకుంటామని, తద్వారా స్థూలకాయులుగా తయారవుతామని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ స్థూల కాయం అనేది జన్యుపరంగానో, మితిమీరిన ఆహార పదార్ధాలు తీసుకోవడం వల్లో, సరైన వ్యాయామం లేకపోవడం వంటి పలు కారణాల వల్లో సంక్రమిస్తుంది అని భావించేవాళ్లు. కానీ ఇది సామాజిక సాంక్రమిక వ్యాధి అని పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది.

లివర్‌పూల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో మనుషుల ఆహారపు అలవాట్లు ఎంపికలపై సామాజిక నిబంధనలు ప్రభావం చూపుతాయని తేలింది. ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు పలు ప్రయోగాత్మక అధ్యయనాలను పరిశీలించారు. ఇందులో మనం తీసుకునే ఆహారం, దాని ఎంపికపై ఇతరుల ఆహారపు అలవాట్ల ప్రభావం ఉంటోందా? అనే దిశగా పరిశీలించారు.

ఈ అధ్యయనాల్లోని సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత మనం తీసుకునే ఆహారం ఎంపికపై సామాజిక ప్రభావం కూడా ఉన్నట్లు నిర్ధారించారు. తక్కువ కేలరీలు, ఎక్కువ ఆహారం తీసుకోవడంపైనే కాకుండా తినే పరిమాణంపై కూడా సామాజిక ప్రభావం ఉంటున్నట్టు ఈ అధ్యయనంలో వెల్లడైంది. మనం ఒక్కరమే కూర్చుని తింటున్నా కూడా మనపై సామాజిక ప్రభావం ఉంటుందని ఈ పరిశోధనలో పాల్గొన్న ఎరిక్‌ రాబిన్సన్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News