: ఆమ్ ఆద్మీ పార్టీ తదుపరి టార్గెట్ హర్యానా
ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా హర్యానాపై దృష్టి సారించింది. హర్యానా ముఖ్యమంత్రి అభ్యర్థిగా యోగేంద్ర యాదవ్ ను రంగంలోకి దించనుంది. అమేధీ నుంచి రాహుల్, మోడీలపై పోటీకి ఆమ్ ఆద్మీ పార్టీ కుమార్ విశ్వాస్ ను బరిలో దించనుంది. విశ్వాస్ అరవింద్ కేజ్రీవాల్ కు సమీప బంధువు. ఇప్పటికే హర్యానాలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించినట్టు విశ్వాస్ వెల్లడించారు. మహారాష్ట్రపై కూడా తాము దృష్టి సారించినట్టు ఆయన వెల్లడించారు.