: మాట నిలబెట్టుకున్న కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్... ఢిల్లీ ప్రజలకు నూతన సంవత్సర కానుకను ఇచ్చారు. ప్రతి ఇంటికీ రోజుకు 666 లీటర్ల శుద్ధమైన నీటిని సరఫరా చేయాలని కేజ్రీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయన ఫైలుపై సంతకం చేశారు. ఈ రోజు ఆయన ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ, తన నివాసంలోనే జలమండలి అధికారులతో సమావేశం నిర్వహించిన కేజ్రీవాల్... తన కలల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పథకం జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది.