: అక్కడ అధికారులు పొగతాగడం నిషేధం
పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్ అన్న గిరీశంగారి వ్యాఖ్యల్ని చైనా దేశీయులు చాలా సీరియస్ గా తీసుకుంటారు. అందుకే అక్కడ 30 కోట్ల మంది పొగాకు మీద కోపంతో... ఊది పారేస్తుంటారు. వారిని ఆ అలవాటు నుంచి దూరం చేయాలని భావించిన చైనా ప్రభుత్వం... అధికారులు ఎవరూ బహిరంగంగా పొగతాగరాదని ఆదేశాలు జారీ చేసింది. 2011లో చైనా వైద్య ఆరోగ్య శాఖ ప్రజలు ఎక్కువగా ఉండే రెస్టారెంట్లు తదితర ప్రాంతాల్లో పొగతాగడంపై మార్గదర్శకాలు వెలువరించింది.
అయితే 30 కోట్ల పొగతాగేవారున్న చైనాలో ప్రభుత్వం ఆదేశాలను ఎవరూ పట్టించుకోకపోవడంతో తాజాగా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పొగతాగడంపై ఉన్న ఆంక్షలను అధికారులే పాటిస్తే... ప్రజలు వారిని అనుసరిస్తారని చైనా ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రభుత్వం చెప్పే మాటలను అక్కడి అధికారులు వింటారా అనేదే అసలు ప్రశ్న.