: తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన ఒక మంచి పని చెప్పండి: సోమిరెడ్డి
తెలంగాణ కోసం ఏ ఒక్కటైనా సాధించామని కేసీఆర్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ చెప్పగలరా? అంటూ టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలదీశారు. తమ స్వార్థ రాజకీయాల వల్ల ఎంత మంది అనాథలుగా మారారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరూ చల్లగా ఉన్నారని విమర్శించారు. కేసీఆర్ జీవితకాలం ఎవరో ఒకరిని తిడుతూనే ఉంటారని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనికిరారని చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జనవరి 3న ఆస్తుల వివరాలు ప్రకటిస్తామని పీసీసీ చీఫ్ బొత్స అంటున్నారని... మరి, ఆయన తన బినామీ పేర్లతో ఉన్న ఆస్తులను కూడా ప్రకటిస్తారా? అంటూ ఎద్దేవా చేశారు.