: ఢిల్లీ సెక్రటేరియట్ లో మీడియాపై ఆంక్షలు
సెక్రటేరియట్ లోకి వెళ్లేందుకు పాసులు అవసరం లేదని గతంలో చెప్పిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు రోజులకే వివాదంలో నిలిచింది. ఢిల్లీ సచివాలయంలోకి మీడియాను అనుమతించలేదు. మీడియా సెంటర్ వరకు మాత్రమే మీడియాను అనుమతించడంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. మీడియా సెంటర్ వరకే జర్నలిస్టులు వెళ్లవచ్చని, మంత్రుల కార్యాలయాల వరకు వెళ్లేందుకు వీల్లేదని ప్రభుత్వం నిబంధన విధించింది. దీంతో ప్రభుత్వ కార్యక్రమాల్ని మీడియా బహిష్కరించింది. అయితే ఈ విషయంలో ఏం జరిగిందో తెలుసుకుంటానని ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ అన్నారు.