: గంగోత్రి ఎక్స్ ప్రెస్ లో మంటలు
విజయవాడలో మరో ఘోర రైలు ప్రమాదం తప్పింది. స్టేషన్ లో ఆరో నంబరు ప్లాట్ ఫాంపై ఉన్న గంగోత్రి ఎక్స్ ప్రెస్ కు చెందిన ఓ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయభ్రాంతులైన ప్రయాణికులు పరుగులు తీశారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. ఈ సందర్భంగా మీడియాను స్టేషన్ లోకి అనుమతించలేదు.