: కాంగ్రెస్ లో ఉండదలుచుకోలేదు: జేసీ
తమకు వివిధ పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. మేము కచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉంది కాబట్టే, పార్టీలు తమను ఆహ్వానిస్తున్నాయని చెప్పారు. ఇకపై తాము (కుటుంబ సభ్యులం) కాంగ్రెస్ పార్టీలో ఉండదలుచుకోలేదని... పార్టీని వీడతామని స్పష్టం చేశారు. జనవరి నెలాఖరులోగా తమ భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తామని జేసీ చెప్పారు. ఈ రోజు అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ జేసీ తన మనసులోని మాటను బయటపెట్టారు.