: అవినీతిని దేశానికి పరిచయం చేసింది చంద్రబాబే: గండ్ర
తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ తోనే వెళ్లిపోయిందని... ఇప్పుడున్న టీడీపీ నకిలీదని కాంగ్రెస్ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. చంద్రబాబు ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడుతున్నారని... అసలు దేశానికి అవినీతిని పరిచయం చేసింది ఆయనే అంటూ ఎద్దేవా చేశారు. లగడపాటి రాజగోపాల్ ను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం మానేసిందని.. ఆయన ఎంత మాట్లాడినా వేస్టే అని తెలిపారు.