: సంక్రాంతి తర్వాత బీజేపీ జెండా: యడ్యూరప్ప
కర్ణాటకలో బీజేపీ తురుపుముక్కగా ఉండి.. అలిగి బయటకు వెళ్లిన మాజీ సీఎం యడ్యూరప్ప తనకు లైఫ్ నిచ్చిన బీజేపీలోకి మళ్లీ తిరిగి రావడం ఖరారైపోయింది. ఇన్నాళ్ల ఊహాగానాలను పటాపంచలు చేస్తూ యడ్యూరప్పే స్వయంగా తాను సంక్రాంతి తర్వాత బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. శివమొగ్గ జిల్లా, శికారిపుర పట్టణంలో కర్ణాటక జనతాపార్టీ కార్యకర్తల సమావేశంలో యడ్యూరప్ప మాట్లాడుతూ.. మోడీని ప్రధానిని చేయడం కోసమే తాను మళ్లీ బీజేపీలోకి వెళుతున్నానని తెలిపారు.