: ఛత్తీస్ గఢ్ ఓటర్ల లిస్టులో ఐశ్వర్యారాయ్ ఎందుకుందమ్మా?
అందాల నటి ఐశ్వర్య స్వగ్రామం ఛత్తీస్ గఢ్ లోని జాష్ పూర్ జిల్లా ఘూఘ్రినా? ఈ సందేహం ఆ గ్రామ ఓటర్ల జాబితాను ఒకసారి చూస్తే మనకే కాదు, ఆ గ్రామస్తులకు, నటి ఐశ్వర్యకు కూడా వచ్చేస్తుంది. అందులో ఐశ్వర్యారాయ్ పేరు ఫొటోతోపాటు దర్శనమిస్తోంది. ఘూఘ్రి గ్రామం పాతాల్గన్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. చిత్రమేమిటంటే ఆ గ్రామంలోని ఇంటినెంబర్ 376లో ఐశ్వర్య నివసిస్తోందని, ఆమె తండ్రి పేరు దినేష్ రాయ్ అని కూడా ఉంది. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు. నిజానికి ఐశ్వర్య కర్ణాటకలోని మంగళూరులో జన్మించారు. ముంబైలో స్థిరపడ్డారు. ఈ రెండూ కాకుండా ఆమె ఛత్తీస్ గఢ్ కు ఎప్పుడు వలస వెళ్లారో? ఆ ఓటర్ల జాబితాను రూపొందించిన అధికారులే చెప్పాలి మరి.