: నేడు ఒంగోలులో టీడీపీ 'ప్రజాగర్జన' సభ
తెలుగుదేశం పార్టీ ఒంగోలులోని మినీ స్టేడియంలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రజాగర్జన సభ నిర్వహించనుంది. కాంగ్రెస్ పార్టీ అవినీతి, కుట్ర రాజకీయాలను వివరిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఈ సభలను నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ నేతలు తెలిపారు. కాగా నిన్న తిరుపతిలో నిర్వహించిన తొలి ప్రజాగర్జన సభకు భారీగా జనం తరలివచ్చారని, ఇది ప్రజల్లో వస్తున్న చైతన్యానికి నిదర్శనమని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు . ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయినట్టు తెలిపారు.