: విభజన జరిగితే రాష్ట్రం ఎడారవుతుంది: జగన్


రాష్ట్ర విభజన జరిగితే రాష్ట్రం ఎడారవుతుందని వైఎస్సార్సీపీ అధినేత జగన్ హెచ్చరించారు. ఎగువ ప్రాంతంలోని ప్రాజెక్టులు నిండితేనే దిగువకు నీరు వస్తుందని చెప్పారు. తన కుమారుడు రాహుల్ ని ప్రధానిని చేసేందుకే సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజిస్తోందని విమర్శించారు. సీఎం కిరణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కుమ్మక్కై రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని అన్నారు. ఈ రోజు చిత్తూరు జిల్లా రాయల్ పేటలో జరిగిన సమైక్య శంఖారావం సభలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగువాడి సత్తా చాటుదామని.. 30 లోక్ సభ స్థానాలను గెలుచుకుందామని చెప్పారు.

  • Loading...

More Telugu News