: మరోసారి అవకాశం ఇవ్వండి.. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతా: చంద్రబాబు


కష్టాల్లో ఉండే ప్రజల కోసమే ప్రజా గర్జన చేపట్టామని చంద్రబాబు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుకుంటూనేపోతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేపట్టిన యువకిరణాలు కేవలం మాటలకే పరిమితమని, చేతల్లో ఏమీ లేదని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే... నిరుద్యోగ భృతి రెండు వేల రూపాయల వరకు ఇస్తామని హామీ ఇచ్చారు. అందరికీ ఉద్యోగాలు కల్పించే బాధ్యత తనదేనని చంద్రబాబు చెప్పారు.

జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన ఘనత కాంగ్రెస్ దే నని చంద్రబాబు విమర్శించారు. ఒక్క ఎకరాకు కూడా నీటిని అందించకుండానే రూ. 80 వేల కోట్లను దోచుకున్నారని ఎద్దేవా చేశారు. అన్ని రంగాల్లో రాష్ట్రం బాగుపడాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. 'మరోసారి అవకాశం ఇవ్వండి... దేశ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పుతా'మని చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News