: 16 నెలలు జైలుకు వెళ్లివచ్చినా అనకొండకు సిగ్గూ ఎగ్గూ లేదు: చంద్రబాబు


రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ శ్మశానంగా మార్చేసిందని చంద్రబాబు విమర్శించారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వ్యతిరేకపవనాలు వీస్తున్నాయని... రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ దెబ్బకు షీలా దీక్షిక్ కు సైతం దిమ్మతిరిగి పోయిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, అనకొండ జగన్ కు ఓటు వేయరాదని కోరారు.

ఎవడబ్బ సొమ్మని జగన్ ప్రజల సొమ్ము దోచుకుంటున్నాడని చంద్రబాబు ప్రశ్నించారు. 16 నెలలు జైలుకు వెళ్లివచ్చినా ఆ అనకొండకు సిగ్గూ ఎగ్గూ లేదని మండిపడ్డారు. పెద్ద అనకొండ రాజశేఖరరెడ్డి వదిలిపెట్టిన చిన్న అనకొండే జగన్ అంటూ కార్యకర్తలను చంద్రబాబు హుషారెత్తించారు. అనకొండకు ఓటేస్తే అది ఏదో ఒక రోజు మిమ్మల్ని మింగేస్తుందని హెచ్చరించారు. అనకొండల్ని చంపేసేందుకే ఢిల్లీలో కేజ్రీవాల్ కు ప్రజలు ఓటేశారని చెప్పారు.

  • Loading...

More Telugu News