: బాగ్ డోగ్రా విమానాశ్రయంలో 70 మంది ప్రయాణికుల ఎదురుచూపులు


పశ్చిమ బెంగాల్, బాగ్ డోగ్రా విమానాశ్రయంలో 70 మంది ప్రయాణికులు తాము వెళ్ళవలసిన విమానంకోసం ఎదురు చూస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో నిన్న బయలుదేరాల్సిన కోల్ కతా-బాగ్ డోగ్రా ఎయిర్ లైన్స్ విమాన సర్వీసును నిలిపివేశారు. విమానాశ్రయానికి వచ్చేవరకు ప్రయాణికులకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో వారు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ఈ రోజు కూడా కోల్ కతా నుంచి బాగ్ డోగ్రా బయలుదేరాల్సిన విమాన సర్వీసులను ఎయిర్ లైన్స్ రద్దు చేసింది.

  • Loading...

More Telugu News