: 2015 క్రికెట్ వరల్డ్ కప్ చైర్మన్ గా రాల్ఫ్ వాటర్స్


2015లో నిర్వహించబోయే వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీనిర్వహణ కమిటీ చైర్మన్ గా న్యూజిలాండ్ కు చెందిన వ్యాపారవేత్త రాల్ఫ్ వాటర్స్ ను నియమించారు. వాటర్స్ ఇప్పటివరకు నిర్వహణ కమిటీకి డిప్యూటీ చైర్మన్ గా వ్యవహరించారు. అయితే, చైర్మన్ జేమ్స్ స్ట్రాంగ్ కిందటివారం ఆకస్మికంగా మరణించడంతో అతని వారసుడిగా వాటర్స్ ను ఎంపిక చేశారు. 2015 వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. 

  • Loading...

More Telugu News