: రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతోంది: రాష్ట్రపతితో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు
సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు రాయపాటి, లగడపాటి, ఉండవల్లి, సబ్బం హరి, హర్ష కుమార్ లు ఈ రోజు హైదరాబాదులో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతోందని ఈ సందర్భంగా వారు రాష్ట్రపతికి తెలిపారు. ఎన్నికల ముందు ఇలాంటి బిల్లులు తీసుకురావడం సరైంది కాదని చెప్పారు. అంతే కాకుండా ప్రణబ్ ముఖర్జీకి వారు ఒక నివేదికను కూడా సమర్పించారు. అవిశ్వాసానికి 70 మంది ఎంపీల మద్దతు ఉన్నా పార్లమెంటును వాయిదా వేశారని నివేదికలో పేర్కొన్నారు. ఇప్పటికే డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఎంఐఎంలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాయని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మైనార్టీలో ఉందని వెల్లడించారు.