: నెలలో ఢిల్లీ ప్రజలు అసలు విషయాన్ని తెలుసుకుంటారు: లాలూ
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్ర సృష్టించిందనడాన్ని ఆర్జేడీ అధినేత లాలూ ఖండించారు. నెలరోజులలో ఢిల్లీ ప్రజలు తామెలాంటి నేతలను ఎన్నుకున్నారో తెలుసుకుంటారని అన్నారు. రాహుల్ ముందు కేజ్రీవాల్ అయినా, నరేంద్ర మోడీ అయినా దిగదుడుపేనని.. వారు రాహుల్ ముందు నిలబడలేరని పేర్కొన్నారు. ఇదంతా కాంగ్రెస్ తో పొత్తు కోసం లాలూ పడుతున్న తాపత్రయంలో భాగం. బీహార్ లో ఆర్జేడీ పరిస్థితి నానాటికి తీసికట్టులా తయారైంది. కాంగ్రెస్ మద్దతుతోనైనా తన పార్టీకి జీవం పోయాలనేది లాలూ యత్నం. కానీ, కోర్టు పశువుల గడ్డిని అడ్డంగా మేసిన నేతగా లాలూని ప్రకటించి ఐదేళ్ల శిక్ష విధించినందున ఆయన పార్టీతో పొత్తుకు కాంగ్రెస్ అంత సుముఖంగా లేదని సమాచారం.