: డిసెంబర్లో ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ. 15వేల కోట్లు
భారత స్టాక్ మార్కెట్లపై ఎఫ్ఐఐలు డిసెంబర్లోనూ తమ విశ్వాసాన్ని చాటారు. 250 కోట్ల డాలర్లు (రూ. 15వేల కోట్లకుపైగా) పెట్టుబడులుగా పెట్టారు. నెలవారీ బాండ్ల కొనుగోలును తగ్గిస్తున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించిన తర్వాత కూడా విదేశీ సంస్థాగత మదుపుదారుల పెట్టుబడులు కొనసాగడం విశేషం.