: ఈరోజూ ఎన్నిక కాని పోప్


కొత్త పోప్ ఎన్నిక ఈరోజూ సాధ్యంకాలేదు! బుధవారం వరుసగా రెండు రహస్య సమావేశాలు నిర్వహించిన కార్డినళ్ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అందుకు సూచనగా సిస్టెయిన్ చాపెల్ నుంచి నల్లని పొగ వెలుపలికి వచ్చింది.

చాపెల్ నుంచి తెల్లటి పొగ వెలుపలికి వస్తేనే పోప్ ఎన్నిక పూర్తయినట్టుగా భావిస్తారు. తమలో ఒకరిని పోప్ గా ఎన్నుకునేందుకు 115 మంది కార్డినళ్లు మరోసారి విఫలురయ్యారు. నిన్న కూడా సిస్టెయిన్ చాపెల్ నుంచి నల్లని పొగ వచ్చిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News