: తడిగుడ్డతో గొంతు కోశారు: ఉండవల్లి
విభజన బిల్లుపై శాసన సభలో చర్చ జరిగితేనే మంచిదని కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. అప్పుడే ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. చర్చ అనంతరం బిల్లును అసెంబ్లీ ఆమోదిస్తుందని ఎవరూ భావించడం లేదని తెలిపారు. ఈరోజు హైదరాబాదులో జరిగిన ఏపీ జర్నలిస్టుల 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ఉండవల్లి మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్ఠానం తడిగుడ్డతో తమ గొంతు కోసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే హైకమాండ్ పై తాము తిరగబడ్డామని, అవిశ్వాసం వరకు వెళ్లామని చెప్పారు. భారత దేశ చరిత్రలో ఇలాంటి సంఘటన ఇంత వరకు జరగలేదని చెప్పారు.