: టేబుల్ ఐటెంగా పెట్టడం కలచివేసింది: హర్షకుమార్


కేంద్ర కేబినెట్ భేటీలో టీబిల్లును ఓ టేబుల్ ఐటెంగా పెట్టడం తమను తీవ్రంగా కలచివేసిందని కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ అన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విభజనకు సంబంధించి కేంద్రం వేసిన ఆంటోనీ కమిటీతో ఒరిగిందేమీ లేదని చెప్పారు. ఈ రోజు హైదరాబాదులో ఏపీ జర్నలిస్టుల ఫోరం నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా ప్రభుత్వమే నాటకాలాడిందని విమర్శించారు. ప్రజల ఆందోళనలను అర్థం చేసుకున్న తాము... స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా చేశామని చెప్పారు. ఈ కార్యక్రమానికి రాయపాటి, సబ్బం హరి, లగడపాటి, ఉండవల్లి హాజరయ్యారు.

  • Loading...

More Telugu News