: మోడీ హిమాలయాలైతే.. రాహుల్ ఓ బచ్చా: బాబా రాందేవ్
ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండడంతో యోగా గురువు బాబా రాందేవ్ మోడీకి తన మద్దతును పెంచుతున్నారు. రానున్న ఎన్నికల్లో మోడీకి ఓటేయాలని కోరుతూ తాను ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. 'అన్ని పార్టీల్లోనూ అవినీతి ఉంది. కానీ మోడీ, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ వంటి నేతలకు అవినీతి మకిలి అంటలేదు' అని బాబా చెప్పారు. రాహుల్ ను ఓ బచ్చా కింద లెక్కగట్టారు. మోడీ హిమాలయాల్లాంటి వారైతే.. రాహుల్ బచ్చాగా అభివర్ణించారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగంలో సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలకు జనవరి 5న మోడీ నుంచి పరిష్కారాలు రాబట్టగలనని ఆశాభావం వ్యక్తం చేశారు.