: టీడీపీ ప్రజాగర్జనకు నన్ను ఆహ్వానించలేదు: హరికృష్ణ


హరికృష్ణకు, టీడీపీకి మధ్య అంతరం కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. సమైక్యాంధ్ర విషయంలో కనీసం అధ్యక్షుడు చంద్రబాబును కూడా సంప్రదించకుండా తన రాజ్యసభ సభ్యత్వానికి హరికృష్ణ రాజీనామ చేయడం జరిగింది. ఆయన తొందరపాటు తనమే ఆయనకు ప్రతికూలంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ రోజు టీడీపీ తిరుపతిలో నిర్వహించనున్న ప్రజాగర్జన సభకు తనకు ఆహ్వానం అందలేదని హరికృష్ణ ప్రకటించడం విశేషం. దీన్నిబట్టి చూస్తే ఇదంతా ఆయన స్వయంకృతాపరాధమే అని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News