: బాలికపై ఆరు నెలలుగా అఘాయిత్యం


కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ రాక్షసుడు 13 ఏళ్ల బాలికపై ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. బాలిక గర్భం దాల్చడంతో ఆమెపై జరుగుతున్న లైంగిక దాడి వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా, యాలాల్ మండలం దౌలాపూర్లో ఇది జరిగింది. ఇంటిపక్కన ఉండే జగదీష్ అనే యువకుడు ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరిస్తూ అత్యాచారం చేస్తున్నాడు. దీంతో ఆమె ఎవరికీ చెప్పలేదు. అయితే, తీవ్రంగా కడుపులో నొప్పి వస్తుండడంతో బాలికను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లగా 4 నెలల గర్భవతని తేలింది. ఆమె తల్లిదండ్రులు నివ్వెరపోయి తర్వాత పోలీసులను ఆశ్రయించారు.

  • Loading...

More Telugu News