: బసవతారకం ఆస్పత్రిలో నూతన విభాగాన్ని ప్రారంభించిన చంద్రబాబు
హైదరాబాదు బంజారాహిల్స్ లో ఉన్న బసవతారకం ఆసుపత్రిలో విదేశీ రోగుల కోసం నూతన విభాగాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి ఆవరణలో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలను ఆవిష్కరించారు. కేన్సర్ బాధితులు ఒకప్పుడు చికిత్స కోసం అమెరికాకు వెళ్లేవారని.. ఇప్పుడు విదేశాల నుంచి ఇక్కడకు వస్తున్నారని బాబు చెప్పారు. దాతలు ముందుకొచ్చి బసవతారకం ఆసుపత్రికి విరాళాలు అందించాలని చంద్రబాబు కోరారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని బసవతారకం ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు.