: వేడుకలు జరుపుకున్న కేజ్రీవాల్ గ్రామస్థులు
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ బాధ్యతలు చేపట్టడంతో ఆయన జన్మస్థలమైన హర్యానాలోని శివాని గ్రామంలో సంతోషాలు వెల్లివిరిశాయి. తమ గ్రామానికి చెందిన వ్యక్తి హస్తినలో ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడంతో ప్రజలు ఆనందోత్సాహంతో వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి కేజ్రీవాల్ కు శుభాకాంక్షలు తెలిపారు. అదే గ్రామంలో ఉంటున్న కేజ్రీవాల్ తండ్రి మురళీలాల్ ను కలిసి అభినందనలు తెలిపి.. ఆయనతో తమ ఆనందాన్ని పంచుకొన్నారు. కాగా, ఇవాళ (శనివారం) మధ్యాహ్నం ఢిల్లీలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పలువురు శివాని గ్రామస్థులు పాల్గొన్నారు.