: శ్రీలక్ష్మి బెయిల్ పై తీర్పు 18కి వాయిదా
ఓఎంసీ కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి మధ్యంతర బెయిల్ పొడిగింపుపై తీర్పును న్యాయస్థానం ఈనెల 18కి వాయిదా వేసింది. బెయిల్ ను పొడిగించాలంటూ శ్రీలక్ష్మి తరుపు లాయర్లు సీబీఐ కోర్టులో నేడు వాదనలు వినిపించారు. ఈనేపథ్యంలో కోర్టు తీర్పును వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది.