: ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కొలిక్కిరాని సీఎం చర్చలు
ఇరవై తొమ్మిది ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశం ముగిసింది. అయితే, మధ్యంతర భృతిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఈ చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఈ సమావేశంలో 45 శాతం భృతి ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు పట్టుబట్టాయి. అయితే, మరో రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం తరఫున నిర్ణయం ప్రకటిస్తామని సీఎం వారికి చెప్పారు. వీలైతే మరోసారి సమావేశమవుదామని ఉద్యోగులకు ముఖ్యమంత్రి చెప్పారు. దాంతో, ఉద్యోగులు నిరాశతో వెనుదిరిగారు.