: ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణం : డీజీపీ
అనంతపురం జిల్లా కొత్తచెరువు దగ్గర జరిగిన బెంగళూరు-నాందేడ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణంగా భావిస్తున్నట్టు డీజీపీ ప్రసాదరావు తెలిపారు. ప్రయాణ సమయంలో బీ-1 బోగీలో మొత్తం 64 మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు. ఈ రోజు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఈ దుర్ఘటనలో ఇప్పటిదాకా 26 మంది మృతి చెందారు.