: డాక్యుమెంట్ రైటర్ల సమ్మె విరమణ
గుంటూరు జిల్లాలో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను ‘మీ సేవ’కు అప్పగించడంతో నిరసనగా రిజిస్ట్రార్ సిబ్బంది రెండు రోజుల నుంచి విధులకు దూరంగా ఉన్నారు. డాక్యుమెంట్ రైటర్లు కూడా సమ్మెకు సై అనటంతో రిజిస్ట్రార్ కార్యాలయం రెండు రోజులుగా వెలవెలబోతోంది. రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో మరోవైపు ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడింది. ఈ నేపథ్యంలో వారితో మంత్రి తోట నర్సింహం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మంత్రి హామీతో సమ్మె విరమిస్తున్నట్లు డాక్యుమెంట్ రైటర్లు ప్రకటించారు. అయితే, ఇవాళ శనివారం, రేపు కార్యాలయం సెలవు దినం కావడంతో సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు తిరిగి పుంజుకునే అవకాశం ఉంది.