: మారిషస్ లో ప్రణబ్ కు విశిష్టరీతిలో స్వాగతం
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మారిషస్ లో అరుదైన రీతిలో స్వాగతం పలికారు. ప్రణబ్ విమానాశ్రయంలో అడుగిడగానే, మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రాంగులామ్ తో పాటు మొత్తం మంత్రి మండలి, ప్రతిపక్ష నాయకుడు, జాతీయ అసెంబ్లీ స్పీకర్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, పోలీసు ఉన్నతాధికారులు అందరూ ఘనస్వాగతం పలికారు.
తనకు లభించిన ఈ విశిష్ట స్వాగతం పట్ల ప్రణబ్ అచ్చెరువొందారట. మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ప్రణబ్ మారిషస్ లో ఉన్నారు. ఆయన మారిషస్ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు.