: 70 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలు కాంగ్రెస్ ను వీడతారు: లగడపాటి
రాష్ట్ర విభజన ప్రక్రియను ఆపకుంటే కాంగ్రెస్ పార్టీని 70 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలు వీడతారని ఆ పార్టీకి చెందిన ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ విభజన అంటూ జరిగితే తీవ్రంగా నష్టపోయేది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని తెలిపారు. విభజన ప్రక్రియ తుది అంకానికి చేరుకుందన్న లగడపాటి, శాసనసభ తీర్మానం చేయకుండా విభజన అసాధ్యమని అన్నారు. విభజనపై జేసీ దివాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారే తప్ప పార్టీని కానీ, అధినేత్రిని కానీ తూలనాడలేదని అన్నారు. అయితే దానిని ఎవరూ అర్థం చేసుకోలేదని లగడపాటి అన్నారు.