: హోం, ఆర్థిక, విద్యుత్ శాఖలను తనవద్దే ఉంచుకున్న కేజ్రీవాల్
ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేజ్రీవాల్ తనతో పాటు ప్రమాణం చేసిన ఆరుగురికి శాఖలను కేటాయించారు. అయితే అత్యంత కీలకమైన హోం, ఆర్థిక, విద్యుత్, ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి ప్లానింగ్, నిఘా శాఖలను తనవద్దే ఉంచుకున్నారు. మనీష్ శిసోడియాకు విద్య, పిడబ్ల్యూడీ శాఖలను కేటాయించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, సామాజిక న్యాయం శాఖలను రాఖీ బిర్లాకు... టూరిజం, న్యాయ, ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి పాలనా పరమైన సంస్కరణల శాఖలను సోమనాథ్ భారతికి కేటాయించారు. గిరీష్ సోనీకి ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, ఉద్యోగావకాశాలు, కార్మిక శాఖలు కేటాయించారు. సత్యేంద్ర జైన్ కు ఆరోగ్యం, పరిశ్రమలు, గురుద్వారా ఎన్నికల శాఖలు అప్పగించారు. సౌరబ్ భరద్వాజ్ కు రవాణా, ఆహార సరఫరా, పర్యావరణ శాఖలను కేటాయించారు.