: గుంతకల్లు చేరుకున్న బెంగళూరు-నాందేడ్ ఎక్స్ ప్రెస్
ఈ ఉదయం అగ్ని ప్రమాదానికి గురైన బెంగళూరు-నాందేడ్ ఎక్స్ ప్రెస్ ఈ మధ్యాహ్నం గుంతకల్లు రైల్వే స్టేషన్ కు చేరుకుంది. రైలు అగ్ని ప్రమాదానికి గురవడంతో ఇతర బోగీల్లో దుమ్ము, ధూళి చేరుకుంది. దీంతో, చెత్తగా తయారైన బోగీలను తొలగించి వేరే బోగీలు ఏర్పాటు చేయాలని గుంతకల్లులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.