: ముంబైలో బహ్రెయిన్ దౌత్యవేత్త రౌడీయిజం
ముంబైలో బహ్రెయిన్ కాన్సులేట్ జనరల్ మొహమ్మద్ అబ్దులజీజ్ అల్ ఖాజాపై తాజాగా మరో కేసు దాఖలైంది. దక్షిణ ముంబైలోని నాపియన్ సీ రోడ్డులో హౌసింగ్ సొసైటీలో ఆయన నివాసం ఉంటున్నారు. అపార్ట్ మెంటు లిఫ్టు చెడిపోయిందని మహిళా మేనేజర్(49) ను బెదిరించారు. చంపుతానన్నారు. అంతేకాదు, ఆమెపై చేయి వేసి అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ మేరకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖాజాపై లోగడ కూడా ఒక కేసు నమోదై ఉంది.