: సర్ ఛార్జి వసూళ్లకు విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాలు
విద్యుత్ సర్ చార్జి వసూలుకు రంగం సిద్ధమైంది. 2012-13 రెండో త్రైమాసికం విద్యుత్ ఛార్జీలను ఖరారు చేస్తూ విద్యుత్ నియంత్రణ మండలి బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 2013 ఏప్రిల్ నుంచి జూన్ వరకు రూ.754 కోట్ల వసూలుకు మండలి ఆదేశాలు ఇచ్చింది.
మరోవైపు 2012 జులై-సెప్టెంబరు మధ్య వాడిన విద్యుత్ కు వినియోగదారులపై సర్ ఛార్జి వసూలు చేయాలని కూడా ఆదేశాల్లో తెలిపింది. మొత్తం 70 పేజీలతో ఈఆర్సీ విద్యుత్ సర్ ఛార్జి ఆదేశాలను ఇచ్చింది.