: అక్రమాస్తులు కూడబెట్టారంటూ.. జానారెడ్డిపై హైకోర్టులో పిటిషన్
రాష్ట మంత్రి జానారెడ్డి అక్రమాస్తులు కూడబెట్టారంటూ వీవీరావు అనే సామాజిక కార్యకర్త నేడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జానారెడ్డి ఆస్తులపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలంటూ ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు.
జానాకు హిమాచల్ ప్రదేశ్ లో పవర్ ప్లాంట్లు ఉన్నాయని, బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చారని, జేకేఏఆర్ వెంచర్స్ సంస్థ పేరిట షేర్లు విక్రయించారని పిటిషన్ లో వెల్లడించారు. కాగా, ఈ పిటిషన్ లో జానారెడ్డితో పాటు మరో 9 మందిని ప్రతివాదులుగా చేర్చారు.