: అవినీతి ఆంధ్రాలోనే కాదు.. దేశమంతటా ఉంది: సోనియా గాంధీ


కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ ఢిల్లీలో ఈరోజు మీడియాతో మాట్లాడారు. నిన్న (శుక్రవారం) జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో లోక్ పాల్, ద్రవ్యోల్బణం తదితర అంశాలపై చర్చించామని ఆమె తెలిపారు. దేశంలో నెలకొని ఉన్న అవినీతిపై దృష్టి సారించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మీడియాకు పిలుపునిచ్చారు. అయితే, అవినీతి అంటే కాంగ్రెస్ పాలనలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాల్లోని అవినీతిని కూడా చూడాలని అన్నారు. పనిలో పనిగా.. కాంగ్రెసేతర ప్రభుత్వాల అవినీతిని వెలికితీయమని మీడియాకు సలహా ఇచ్చారు.

  • Loading...

More Telugu News