: బాలీవుడ్ నటుడు ఫరూక్ షేక్ మృతి
బాలీవుడ్ సీనియర్ నటుడు ఫరూక్ షేక్(64) గతరాత్రి (శుక్రవారం) దుబాయ్ లో గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని మరో నటి దీప్తి నావల్ తెలిపారు. అయితే, పూర్తి వివరాలు తనకు తెలియవన్నారు. అంత్యక్రియల కోసం ఫరూక్ ను ఈ రోజు దుబాయ్ నుంచి ముంబైకి తరలించనున్నారు. 1973 లో 'గరమ్ హవా' చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆయన 70, 80 దశకాల్లో వచ్చిన పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. చివరిగా ఫరూక్ 'యే జవానీ హే దివానీలో' రణబీర్ కపూర్ కు తండ్రిగా నటించారు. అటు ఫరూక్ మరణంపై అమితాబచ్చన్, శేఖర్ కపూర్, అర్షాద్ వార్షీ తదితరులు ట్విట్టర్ లో స్పందించారు.