: 2028 నాటికి ప్రపంచ మూడో పెద్దన్న భారతే


ఆర్థిక సంక్షోభం తర్వాత కుంటుతూ నడుస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ 2028 నాటికి తగిన బలం సంతరించుకోనుంది. అప్పటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని లండన్ కు చెందిన ఒక కన్సల్టెన్సీ వెల్లడించింది. తొలి స్థానాన్ని అమెరికా కోల్పోతుండగా.. ప్రపంచ అగ్ర రాజ్యంగా చైనా అవతరించనుంది. ప్రస్తుతం 1,758 బిలియన్ డాలర్లతో భారత్ ప్రపంచంలో 11వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండగా.. 2018 నాటికి 9వ స్థానానికి చేరుకుంటుందని సదరు కన్సల్టెన్సీ అంచనా వేసింది. 4,124 బిలియన్ డాలర్లతో 2023 నాటికి 4వ స్థానానికి, 2028 నాటికి 6,560 బిలియన్ డాలర్లతో 3 స్థానానికి మెరుగుపడుతుందని తెలిపింది.

  • Loading...

More Telugu News