: 16 వందల మంది పోలీసులతో భారీ భద్రత
మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ ఏడవ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న రాంలీలా మైదానం... పూర్తి స్థాయిలో పోలీసుల నీడలోకి వెళ్లిపోయింది. ఏకంగా 16 వందల మంది సాయుధ పోలీసులతో రాంలీలా ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దీనికి తోడు 20కి పైగా ప్రాంతాల్లో అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా బాంబ్ స్క్వాడ్, ఢిల్లీ పోలీస్ కమెండోలు కూడా రాంలీలా మైదానాన్ని జల్లెడ పడుతున్నారు.
ఇప్పటిదాకా ఢిల్లీ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారిలో సాహిబ్ సింగ్ వర్మ మాత్రమే బహిరంగ ప్రదేశంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తర్వాత ఓపెన్ ప్లేస్ లో ప్రమాణం చేస్తున్న రెండో సీఎం కేజ్రీవాలే. రాంలీలా చేరుకునే క్రమంలో 11 గంటలకు కేజ్రీవాల్ కౌశాంబి స్టేషన్ నుంచి రాంలీలా మైదాన్ కు మెట్రో రైల్లో వెళ్లనున్నారు. దీంతో, కౌశాంబి స్టేషన్లో కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.