: ప్రమాణ స్వీకారానికి రాలేనంటూ కేజ్రీవాల్ కు హజారే లేఖ
ఏఏపీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు అన్నా హజారే లేఖ రాశారు. ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కేజ్రీకు హజారే లేఖలో అభినందనలు తెలిపారు. అంతే కాకుండా, మంత్రులుగా ప్రమాణం చేస్తున్న కేజ్రీవాల్ సహచరులకు కూడా అన్నా అభినందనలు తెలియజేశారు. అనారోగ్య కారణాల వల్ల తాను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నానని తెలిపారు.